123తెలుగు పాఠకులు మరియు శ్రేయోభిలాషులందరికీ 123తెలుగు.కామ్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025కి వీడ్కోలు చెబుతూ, రాబోయే 2026 సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆనందం, విజయం, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం.
టాలీవుడ్‌కు 2025 సంవత్సరం అంత సులువైనదిగా సాగలేదు. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించిన సినిమాలు చాలా తక్కువే. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మిరాయ్’, ‘కోర్ట్’, ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలు మాత్రం లాభాలు తెచ్చాయి. ‘OG’, ‘HIT 3’, ‘కుబేర’, ‘తండేల్’ వంటి చిత్రాలు ఓ మోస్తరు వసూళ్లు సాధించాయి. అయితే భారీ బడ్జెట్ సినిమాలు చాలావరకు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, మొత్తం పరిశ్రమకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. అయినా, మంచి టాక్‌తో ‘శంబాల’ చిత్రం ఏడాదికి మంచి ముగింపు ఇచ్చింది.
కానీ 2026పై మాత్రం టాలీవుడ్‌కు మంచి ఆశలున్నాయి. ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘పెద్ది’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘జై హనుమాన్’, ‘ఫౌజీ’, ఎన్టీఆర్-నీల్ చిత్రం, ‘ది పారడైస్’, ‘ఆదర్శ కుటుంబం’ వంటి ఆసక్తికరమైన సినిమాలు రానున్నాయి. ఈ ఏడాదిలో పరిశ్రమ మళ్లీ పుంజుకుని మంచి విజయాలు సాధిస్తుందని ఆశిద్దాం.
మీ అందరి మద్దతు వల్లే నేడు తెలుగు సినిమా వార్తలు, రివ్యూలు, అప్‌డేట్స్ కోసం 123తెలుగు.కామ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లీడింగ్ వెబ్‌సైట్‌గా నిలిచింది. తెలుగు సినిమాతో పాటు ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌ల సమాచారం కూడా మేము మీకు అందిస్తున్నాం.
2026లో కూడా మీకు చక్కటి సమాచారాన్ని అందించాలని 123తెలుగు.కామ్ ఆశిస్తోంది. మీకు వేగంగా, పక్కా సమాచారాన్ని సరైన సమయానికి అందించేందుకు మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మరోసారి మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.


