‘12A రైల్వే కాలనీ’ ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తుంది – అల్లరి నరేష్

‘12A రైల్వే కాలనీ’ ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తుంది – అల్లరి నరేష్

Published on Nov 18, 2025 4:02 PM IST

12A-Railway-colony
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పొలిమేర సిరీస్‌తో పేరుపొందిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా పనిచేస్తూ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా కనిపించనుంది. సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ వేడుకలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “64 సినిమాలు చేసిన నేను రిలీజ్ సమయం దగ్గరకు వస్తే టెన్షన్ పడుతుంటాను. కానీ నాని మొదటి సినిమా చేస్తున్నా ఎక్కడా టెన్షన్ లేదు. అందుకు కారణం మన దగ్గరున్న ప్రోడక్ట్‌ పై ఉన్న నమ్మకం. అనిల్ గారు, నాని ఇద్దరూ ఈ సినిమాపై తీసుకున్న కేర్‌ ప్రత్యేకం. నేను ఇప్పటివరకు 35 మంది కొత్త దర్శకులతో పని చేశాను, వారిలో చాలా మంది సక్సెస్ అయ్యారు. 12A రైల్వే కాలనీ వంటి జానర్ నేను ఎప్పుడూ చేయలేదు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. నవంబర్ 21న థియేటర్స్‌లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ. ఆనంద్, విజయ్ కనకమేడల తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, హీరోయిన్ కామాక్షి, షో రన్నర్ అనిల్ విశ్వనాథ్, దర్శకుడు నాని, వైవా హర్ష తదితరులు సినిమాలోని ప్రత్యేకతలను వివరించారు. ట్రైలర్‌ అద్భుతంగా ఉందని, కథ-స్క్రీన్‌ప్లే-విజువల్స్-మ్యూజిక్ ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని తెలిపారు. నరేష్ కొత్త దర్శకులకు ఇస్తున్న సహాయం, సినిమాపై ఆయన డెడికేషన్‌ను పలువురు ప్రశంసించారు.

సినిమా మొత్తం కుటుంబం కలిసి ఆస్వాదించే థ్రిల్లర్ అని, ఇంటర్వెల్‌ బ్లాక్ మొదలుకుని క్లైమాక్స్ వరకు ప్రేక్షకులు ఊహించని ట్రీట్మెంట్లు ఉంటాయని టీమ్ తెలిపింది. 12A రైల్వే కాలనీ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు