థియేటర్ల కి కొత్త ఉత్సాహం తెచ్చిన పుష్పరాజ్…మూడు రోజుల్లో మామూలుగా లేదు!

Published on Dec 20, 2021 12:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ థియేటర్ల లోకి వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకు పోతుంది. ఈ చిత్రం థియేటర్ల కి కొత్త ఉత్సాహం తెచ్చిన అని చెప్పాలి.

గడిచిన మూడు రోజుల్లో 173 కోట్ల రూపాయలను సాధించడం జరిగింది. 2021 లో ఇండియా లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది అంటూ చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. అంతేకాక ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకు పోతూ, మరిన్ని రికార్డు లని సాధించే దిశగా దూసుకుపోతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, ఫాహద్గ ఫజిల్ విలన్ పాత్రలో నటించారు. సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :