డా. మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో డా. మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ తాజాగా హైదరాబాద్ లోని దసపల్ల హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, సురేష్ కొండేటి తనకు ఫోన్ చేసి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయమని అడిగితే సినిమా గురించి తెలుసుకున్నాను అని అన్నారు. చాలా మంది నటీనటులు కనిపిస్తున్నారు, టైటిల్ చాలా బాగుంది, 1997 తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి అని అన్నారు. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు, ఫస్ట్ లుక్ బాగుంది, ఈ సినిమాతో దర్శకుడు, నిర్మాత, నటన ఇలా ఇన్ని పనులు చేయడం నిజంగా చాలా కష్టం, అయినా కూడా మోహన్ గారు మొదటిసారి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్ సర్ అంటూ చెప్పుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా చేయడానికి కారణం మోహన్ గారు ఒకరోజు తనకు ఈ కథ చెప్పారు అని, కథ వినగానే చేయాలని అనిపించింది అని, ఇది హీరోనా, చిన్న పాత్ర అన్నది కాకుండా ఓ మంచి పాత్ర చేసానన్న తృప్తి కలిగింది అని, మోహన్ గారు మొదటిసారి అయినా కూడా చాలా బాగా తీశారు అని, ముఖ్యంగా నటుడిగా కూడా అద్భుతంగా నటించారు అని, తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తే ఆయననుండి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి అని అన్నారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ, మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది అని అన్నారు. ఈ సినిమాలో ఆయన తనకు కొడుకుగా నటించినట్లు తెలిపారు. అప్పటినుండి తనతో అదే అనుబంధం కొనసాగుతుంది అని. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చిందని, అయితే ఈ సినిమాలో మీరు నటించాలని అడిగాడు అంటూ చెప్పుకొచ్చారు. తను పోలీస్ కావాలని వాళ్ళ నాన్న గారికి కోరిక ఉండేది అని, అది ఎలాగూ జరగలేదు కాబట్టి ఇలా పోలీస్ పాత్రల ద్వారా అయినా ఆ కోరిక తీరింది అంటూ చెప్పుకొచ్చారు. పోలీస్ గా దేవినేని సినిమాలో చేశాను అని, అప్పటినుండి చాలామంది పోలీస్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు అని, ఒకరోజు చిరంజీవి గారు నువ్వు నటుడిగా పనికి వస్తావు ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో యాక్టింగ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని, చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అని అన్నారు.
హీరో మోహన్ మాట్లాడుతూ, ముందుగా కోటిగారికి థాంక్స్ చెప్పాలి అని అన్నారు. తన ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు అని, ఆయన లేనిదే ఏ పని చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను, ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు, అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు అని అన్నారు. అలాగే నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి, కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు, ఆయన చిన్న పాత్రయినా చాలా చక్కగా చేశాడు అని అన్నారు. అలాగే బెనర్జీ గారు, శ్రీకాంత్, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు అని తెలిపారు. ఓ బర్నింగ్ ఇష్యుని తీసుకుని ఈ సినిమా చేసినట్లు తెలిపారు. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది అని, తన ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.


