మచ్ అవైటెడ్ మూవీ ‘2.0’ విడుదలకోసం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ను చూడాలని సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ స్క్రీన్లలో విడుదలకానున్న విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా ఒక్క నైజాం ఏరియాలోనే ఈచిత్రం 400 థియేటర్లలో విడుదలకానుంది. అలాగే మొదటి రోజుహైదరాబాద్లో సుమారు 600 కు పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇక రజినీ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ కావడం విశేషం.
సూపర్ స్టార్ రజినీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. 600 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 29న తెలుగు,తమిళ , హిందీ భాషల్లో 2డి తో పాటు 3డిలోనూ విడుదలకానుంది.


