సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘2.ఓ’ చిత్రం నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి సన్నధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ లో ఘనంగా జరుపుకుంది.
ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోంది. గ్రాఫిక్స్ కి అత్యంత విలువ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రసాద్ మరియు దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వంశీ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు.
కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తం ఎనిమిది వందల థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదల కానుంది. భాషల వైజ్ గా థియేటర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళ్ – 307 థియేటర్స్
తెలుగు – 270 థియేటర్స్
హిందీ – 223 థియేటర్స్
మొత్తం – 800 థియేటర్స్


