20 ఏళ్ల దర్శకుని చేతిలో ఆర్జీవీ జీవిత చరిత్ర.!

Published on Sep 16, 2020 2:02 pm IST

తన ఫిలిం మేకింగ్ స్టైల్ తో టాలీవుడ్ లో ఒక నయా ట్రెండ్ ను సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన సినెమాలు ఫలితంతో సంబంధం లేకుండా ఎంత నిక్కచ్చిగా అయితే చూపిస్తాడో తాను కూడా రియల్ లైఫ్ లో అలాగే ఉంటాడు. అయితే ఇప్పుడు తీస్తున్న సినిమాల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ.. ఇప్పుడు మాత్రం ఈ సంచలనాల దర్శకుని జీవిత చరిత్రపై ఒక బయో పిక్ రానుంది.

మొత్తం మూడు పార్టులుగా ప్లాన్ చేసిన ఈ చిత్రంని కేవలం 20 సంవత్సరాలు కలిగిన దొరసాయి తేజ అనే యువ దర్శకుడు టేకప్ చెయ్యడం విశేషం. అలాగే మొదటి పార్ట్ కు “రాము” అనే టైటిల్ ను పెట్టగా ఏఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తల్లి మరియు సోదరిలు ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం అనంతరం క్లాప్ కొట్టి లాంచ్ చేసారు.

అలాగే ఇదే యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా యుక్త వయసులో గల ఆర్జీవీ రోల్ ను కూడా పోషించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మొమ్మకు మురళి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందో ఆర్జీవిలోని తెలియని కోణాలు కూడా ఏమన్నా కనిపిస్తాయోచూడాలి.

సంబంధిత సమాచారం :

More