సమంత అభిమానులకు పండగే పండుగ !

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఆమె కోసమే సినిమా చూసే అభిమానులున్నారంటే అతిశయోక్తికాదు. అలాంటి అభిమానులకు ఈ 2018 సంవత్సరం పండుగలా ఉండనుంది. ఎందుకంటే ఈ ఏడాదిలో సమంత నటించిన, నటిస్తున్న 6 సినిమాలు విడుదలకానున్నాయి.

ముందుగా చరణ్ సరసన నటించిన ‘రంగస్థలం’ ఈ నెల 30న విడుదలకానుండగా ఇటీవలే ముగించిన ‘మహానటి’ మే 9న రానుంది. అంతేగాక విశాల్ తో కలిసి ఆమె నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు) కూడ ఈ ప్రథమార్ధంలోనే విడుదలకానుంది. ఇవి కాకుండా ప్రస్తుతం సెట్స్ మీదున్న ద్విభాషా చిత్రం ‘యు టర్న్’, శివ కార్తికేయన్ తో కలిసి చేస్తున్న ‘సీమరాజ’, విజయ్ సేతుపతితో నటిస్తున్న ‘సూపర్ డీలక్స్’ చిత్రాలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానున్నాయి. సో.. ఈ ఏడాది మొత్తం సమంత దక్షిణాది ప్రేక్షకులను రెగ్యులర్ గానే పలకరించనుందన్నమాట.