బాలీవుడ్ కి చెమటలు పట్టిస్తున్న 2020

Published on Jul 3, 2020 12:10 pm IST

ప్రపంచానికి విషాదం అంటే ఏమిటో పరిచయం చేసింది 2020. మొదలవుతూనే ఈ సంవత్సరం మానవజాతికి చుక్కలు చూపించింది. కరోనా అనే మహమ్మారిని పరిచయం చేసి మనిషి మనుగడను, సాంకేతికను ప్రశ్నిస్తుంది. గడచిన ఆరునెలల్లో నరకం చూసిన జనాలు మరో ఆరునెలల్లో ఎన్ని ఉపద్రవాలు చూడాల్సివస్తుందో అని బెంబేలెత్తుతున్నారు. ఇక 2020 చిత్ర పరిశ్రమను కుదేలు చేసింది. ఉపాధి లేక కూలీలు, నష్టాలు భరిస్తూ నిర్మాతలు, పనిలేక దర్శకులు, డబ్బుల్లేక చిన్న చిన్న నటులు ఇబ్బందిపడుతున్నారు.

ఐతే 2020 వలన బాగా నష్టపోయిన పరిశ్రమగా బాలీవుడ్ మిగిలింది. బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెలల వ్యవధిలో బాలీవుడ్ లోని అనేక మంది ప్రముఖులు మరణించారు. ఇర్ఫాన్ ఖాన్ మరణించిన మరుసటిరోజు రిషి కపూర్ మరణించారు. సుశాంత్ ఆత్మ హత్య మరింత విషాదం నింపింది. కాగా నేడు లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండెపోటుతో మరణించారు.ఇలా వరుస మరణాలను చూస్తున్న బాలీవుడ్ 2020 అంటే బయపడుతున్నారు.

సంబంధిత సమాచారం :