2021లో ఆ మొనగాడెవరో తేలిపోనుంది..!

Published on Jul 15, 2020 4:29 pm IST

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. అలాగే వాటిని పాన్ ఇండియా చిత్రాలుగా అన్ని భాషలలో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్, చరణ్ ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక పుష్ప తో అల్లు అర్జున్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. ఇంత వరకు బాలీవుడ్ లో అడుగుపెట్టని మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్…కూడా క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక మహేష్ దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్న సర్కారు వారి పాట పాన్ పాన్ ఇండియా మూవీనా కాదా ? అనే దానిపై స్పష్టత లేదు.

కాగా పవన్, ఎన్టీఆర్, చరణ్ మరియు బన్నీ 2021లో బాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. మరి వీరిలో బాలీవుడ్ లో సత్తాచాటే హీరో ఎవరో వచ్చే ఏడాది తేలిపోనుంది. ఇక టాలీవుడ్ నుండి ఒక్క ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. బాహుబలి చిత్రాలతో పాటు సాహూ కూడా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. కాబట్టి 2021లో ప్రభాస్ తరువాత బాలీవుడ్ లో జెండా ఎగరేసే హీరో ఎవరో తేలిపోనుంది.

సంబంధిత సమాచారం :

More