2024 సంక్రాంతి బాక్సాఫీస్ : అప్పుడే అంతా అయిపోలేదా ?

2024 సంక్రాంతి బాక్సాఫీస్ : అప్పుడే అంతా అయిపోలేదా ?

Published on Oct 4, 2023 2:00 AM IST

TFI m

ప్రతి ఏడాది మాదిరిగా రానున్న 2024 సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజ్ కోసం రెడీ అవుతున్నాయి. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల గుంటూరు కారం మూవీ జనవరి 12న విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు, అలానే ఆ డేట్ మిస్ అయ్యేది లేదని తాజాగా నిర్మాత నాగవంశీ తెలిపారు. మరోవైపు నాగార్జున, యువ దర్శకుడు విజయ్ బిన్నీ ల నా సామిరంగ కూడా సంక్రాంతి బెర్త్ ని ఖాయం చేసుకుంది. ఇక యువ నటుడు తేజ సజ్జ తో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మూవీ హనుమాన్ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని ల యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్ కూడా జనవరి 12న రిలీజ్ కానుంది. అలానే విజయ్ దేవరకొండ తో పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందని అంటున్నారు. ఇక వీటితో పాటు విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను ల సైంధవ్ కూడా సంక్రాంతికే రానుందట. అటు రజినీకాంత్ కీలక పాత్ర చేస్తోన్న లాల్ సలాం, శివ కార్తికేయన్ అయలాన్ కూడా సంక్రాంతి రేస్ లో ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమాలు అన్ని కూడా సంక్రాంతి కి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అయితే అప్పుడే అంతా అయిపోలేదని, పండుగకి మరొక మూడు నెలల సమయం ఉండడంతో అప్పటికి కొన్ని సమీకరణాలు మారి వీటిలో కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ మారే అవకాశం లేకపోలేదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం ఒకేసారి ఇన్ని మూవీస్ సంక్రాంతి బరిలో నిలిస్తే అప్పటికి థియేటర్స్ కొరత సమస్య బాగా తలెత్తే ఛాన్స్ ఉందని, అందువలన ఆ సమయానికి కొన్ని రిలీజ్ డేట్స్ మారుతాయని అంటున్నారు. మరి ఈ సినిమాలలో ఏది పక్కాగా సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ లో నిలుస్తుందో తెలియాలి అంటే మరొక మూడు నెలల వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు