సమీక్ష : 2 ఫ్రెండ్స్- కొత్తదనంలేని ప్రేమ కథ

సమీక్ష : 2 ఫ్రెండ్స్- కొత్తదనంలేని ప్రేమ కథ

Published on Oct 26, 2018 6:16 PM IST
 2Friends movie review

విడుదల తేదీ : అక్టోబర్ 26, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా,  ఫర

దర్శకత్వం :   శ్రీనివాస్ జి.ఎల్.బి

నిర్మాతలు : ముళ్లగూరు ఆనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు

సంగీతం : పోలూర్ ఘటికాచలం

స్క్రీన్ ప్లే : టి.సురేందర్ రెడ్డి

ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్

సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శ్రీనివాస్ జి.ఎల్.బి తెరకెక్కించిన చిత్రం ‘2 ఫ్రెండ్స్’. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ :

నాని ,(సూరజ్ ) మిత్ర విందా(పరా ) ఇద్దరు చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకే కాలేజీలో కలిసి చదువుతారు. ఈ క్రమంలో నాని , అవంతిక(సోనియా ) ను చూసి ప్రేమలో పడతాడు. అవంతిక కూడా అదే కాలేజీలో చేరడంతో నాని, అవంతిక ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అవంతిక తన బావ (అఖిల్) ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ అఖిల్ ఆ పెళ్లికి ఒప్పుకోడు. ఇక అవంతిక తనను ప్రేమించట్లేదని అనుకొనినాని డిఫ్రేషన లోకి వెళ్ళిపోతాడు. తన బెస్ట్ ఫ్రెండ్ బాధను చూడలేక మిత్రవింద ఎలాగైనా అవంతిక ను , నాని కి దగ్గర చేయలనుకుంటుంది దాని కోసం ఆమె ఏం చేసింది నాని కోసం మిత్రవింద ఏం చేసింది ? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు కీలకమైన రెండు పాత్రలు నాని , మిత్ర వింద పాత్రల్లో నటించిన సూరజ్, పరా లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఫ్రెండ్స్ బ్యాచ్ లో నటించిన ధనరాజ్ , స్నిగ్ధా లు అక్కడక్కడా నవ్వించారు. ఇక ఫ్రెండ్షిప్ గురించి దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది.

సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు యూత్ ను ఆకట్టుకుంటాయి. ఇక సీనియర్ నటీనటులు కోట శ్రీనివాసరావు , జయప్రకాష్ రెడ్డి , శ్రీ లక్ష్మీ కనిపించింది తక్కువ సేపైనా ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఫ్రెండ్ షిప్ , ప్రేమ ను బేస్ చేసుకొని దర్శకుడు రాసుకున్న ఈ కథ తెరమీద ఎలాంటి అనుభూతిని ఇవ్వలేకపోయింది. ఓల్డ్ ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బలమైన సన్నివేశాలు ఆసక్తి లేని ట్విస్ట్ లు ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయి. ఇక ఉమ్మడి కుటుంబం అంటూ సాధు కోకిల తో దర్శకుడు చేయించిన కామెడీ పూర్తి గా బెడిసి కొట్టింది. సినిమా మధ్య మధ్య లో వచ్చే ఈ ట్రాక్ చికాకు తెప్పిస్తుంది.

లవ్ ట్రాక్ కు స్కోప్ వున్నా కూడా దర్శకుడు అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు. ఇక సినిమాలో పెద్దగా తెలిసిన నటీనటులు లేకపోవడం కూడా మరో మైనస్. కొత్త వాళ్ళతో మ్యానేజ్ చేద్దాం అనుకున్న దర్శకుడు వారి దగ్గర నుండి సరైన నటన ను రాబట్టుకోలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

ఫ్రెండ్ షిప్ విత్ లవ్ అనేకాన్సెప్ట్ తో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న దర్శకుడి ప్రయత్నం సక్సెస్ కాలేదు. నెమ్మదించిన కథనం ఆసక్తిలేని స్క్రీన్ ప్లే తో సినిమాను చాలా చోట్ల బోరింగ్ గా మార్చాడు. ఇక ఘటికాచలం అందించిన సంగీతం కూడా చాలా ఆర్డినరీ గా వుండి ఒక్క పాట కూడా గుర్తిండిపోదు. నేపథ్య సంగీతం కూడా సోసో గానే వుంది.

సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. లో బడ్జెట్ చిత్రాన్నీ కూడా తన కెమెరా తో సినిమాకు రిచ్ లుక్ ను తీసుకురాగలిగాడు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగానే వుంది. ఈచిత్రాన్ని లో బడ్జెట్ తో నిర్మించిన మంచి క్వాలిటీ అందించడంలో నిర్మాతలు విజయం సాధించారు.

తీర్పు :

యూత్ ను టార్గెట్ చేసుకొని తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ ఆకట్టుకోలేకపోయింది. ఓల్డ్ ఫార్మట్ లో సాగె ఈచిత్రంలో బలమైన సన్నివేశాలు లేకపోవడం అలాగే ఎంగేజింగ్ గా లేని కథనం, స్క్రీన్ ప్లే చిత్రాన్ని పేలవంగా మార్చాయి. చివరగా రొటీన్ స్టోరీ తో బోర్ కొట్టించే ఈచిత్రానికి ఫ్యామిలీతో పాటు యూత్ కూడా కనెక్ట్ అవ్వడం కష్టమే.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు