3 మిలియన్ వ్యూస్ సాధించిన గల్లీ రౌడీ!

Published on Sep 13, 2021 1:56 pm IST


సందీప్ కిషన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా జీ. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రం లో వైవా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి మరియు బాబీ సింహ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల ప్రచార చిత్రాలు, మరియు వీడియో లు ఇప్పటికే సినిమా పై ఆసక్తి పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం తో ట్రైలర్ కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఒక్క రోజు కూడా పూర్తి కాకముందే మూడు మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని, సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ను సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ట్రైలర్ కి వస్తున్న భారీ రెస్పాన్స్ పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్స్ తెలిపింది.

గల్లీ రౌడీ ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :