బాలు స్వరానికి 45 వసంతాలు

బాలు స్వరానికి 45 వసంతాలు

Published on Dec 15, 2011 9:32 AM IST


సరిగ్గా 45 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఒక స్వరం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక స్వరం పరిచయం అయింది. ఆ స్వరం ఎవరిదో కాదు ఎస్పీ బాలుది. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటితో 45 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఎస్పీ. కోదండ పాణి గారు స్వరాలు సమకూర్చిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో తన మొదటి పాట పాడారు. ఆ పాటకి గాను ఆయన 300 రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు. ఆ తర్వాత బాలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక రొమాంటిక్ డ్యూయెట్ అయినా, ఒక భాదాకరమైన పాట అయినా, ఒక భక్తిరస కీర్తన అయినా ఇలా ఎలాంటి పాట అయినా బాలు ఆ పాట కి ప్రాణం పోసేవారు.

ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం ఇలా ఏ హీరో అయినా ఆ హీరోనే స్వయంగా పాట పాడాడు అనేలా తన గొంతుతో మేజిక్ చేసేవారు బాలు గారు. బాలు దాదాపుగా 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఇవే కాకుండా 6 నేషనల్ అవార్డులు అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి ‘పద్మ భూషణ్’ అవార్డు అందుకున్నారు. ఆయన నేటి తరం గాయకులకు తెరిచిన పుస్తకం లాంటి వారు.

ఈ సంధ్రభంగా 123తెలుగు.కాం బాలుకి సెల్యూట్ చేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు