ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న సెవెన్ !

Published on May 9, 2019 6:05 pm IST

ప్రముఖ కెమెరా మేన్ నిజార్ షఫీ దర్శకత్వంలో దర్శకుడు రమేష్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా మన ముందుకు వస్తున్న చిత్రం సెవెన్(7). రహ్మాన్, హవిష్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి వంటి తారాగణం నటిస్తున్నారు. కాగా తాజాగా విడుదలయిన ఈ చిత్రం ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను చూస్తుంటే అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసే ఓ యువకుడు చుట్టూ ఈ సినిమా సాగుతున్నట్లు అనిపిస్తోంది.

మొత్తానికి సరికొత్తగా మన ముందుకు వచ్చిన సెవెన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తిపెంచుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. కాగా ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాకు బస్టర్ సినిమాకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More