అఖండ విజయానికి నేటితో ఏడేళ్లు !

Published on Jul 6, 2020 11:11 am IST

యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు, గొప్ప అనుభూతికి గురిచేసి అఖండ విజయాన్ని సాధించిన సినిమా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’- ది బిగినింగ్’. అప్పటి వరకు భారతీయ సినీ పరిశ్రమ చూడని రీతిలో వసూళ్ల వర్షం కురిపించిందీ ఈ సినిమా. అయితే ఇదే రోజు (జూలై 6), 2013 లో, రాజమౌళి బాహుబలి ది బిగినింగ్ యొక్క మొదటి రోజు షూటింగ్ ను మొదలుపెట్టారు. షూట్ కర్నూలులోని ప్రసిద్ధ రాక్ గార్డెన్స్ వద్ద ప్రారంభమైంది. ఈ ప్రత్యేక రోజున, బాహుబళి మేకర్స్ వేలాది మంది అభిమానుల మధ్య షూటింగ్ ప్రారంభించిన క్షణాలను గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియోలో ఫస్ట్ డే షూటింగ్ ఫిక్స్ ను పోస్ట్ చేస్తూ నేటితో ఏడేళ్లు గడిచిపోయాయని అభిమానులతో పంచుకున్నారు.

కాగా ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా తరవాతే వరల్డ్ సినిమా టాలీవుడ్ మీద దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనినులు చేసింది గొప్ప సాహసమనే అనాలి. ఈ చిత్ర విజయం ఇచ్చిన భరోసాతో అనేకమంది నిర్మాతలు సైతం వందల కోట్ల బడ్జెట్ కేటాయించి సినిమాలు నిర్మించేందుకు ముందుకురావడం మొదలైంది. ఇలా తెలుగు సినిమా పరిశ్రమలోనే కాక, భారతీయ సినీ పరిశ్రమలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తైంది.

ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ‘బాహుబలి -2’ రూ.1650 కోట్ల వసూళ్లతో అనేక రికార్డుల్ని నెలకొల్పి కొత్త చరిత్రనే సృష్టించింది. ఈ చిత్రంతో తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అంచనాలు, అభిమానులు పెరగడమేకాదు, మార్కెట్ స్థాయి కూడా అమాంతం పెరిగింది.

https://mobile.twitter.com/BaahubaliMovie/status/1279975653513637889

సంబంధిత సమాచారం :

More