మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం ’96’. ఇటీవల విడుదలైన ఈచిత్రం అద్భుతమైన రివ్యూస్నుం సొంతం చేసుకొని సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక తమిళ నాడు తో పాటు కేరళలోను విడుదలైన ఈచిత్రం అక్కడ కూడా మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. కేవలం 33లక్షలకు అక్కడ అమ్ముడైన ఈచిత్రం నాలుగు రోజుల్లో రూ.2.16కోట్ల గ్రాస్ ను అలాగే రూ.88లక్షల షేర్ వసూళ్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించనుంది.
నూతన దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్నినంద గోపాల్ నిర్మించారు. రోమాంటిక్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో విజయ్ సేతుపతి ఫొటోగ్రాపర్ పాత్రలో నటించారు. గోవింద్ మీనన్ సంగీతం అందించారు. ఇక ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేయనున్నాడు.


