“వకీల్ సాబ్”తో దిల్ రాజుకు పెద్ద టాస్కే ఉంది.!

Published on Sep 19, 2020 9:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మన దగ్గర ఉన్న క్రేజ్ కానీ బాక్సాఫీస్ స్టామినా కోసం కానీ ప్రత్యేకంగా చర్చ పెట్టనవసరం లేదు. డిజాస్టర్ సినిమాలతో కూడా పవన్ మినిమమ్ రాబట్టేయగలడు. అలా ఇప్పుడు తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” పై కూడా భారీ అంచనాలు తెచ్చుకోగలిగాడు. పైగా ఈ చిత్రం పవన్ నుంచి రానున్న కం బ్యాక్ చిత్రం కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. థియేటర్స్ తెరవని పరిస్థితి పైగా తెరిచినా ఎలాంటి వసూళ్లు వస్తాయో కూడా ఎవరికీ తెలీదు. ఈ లోపలే పలు చిత్రాలకు ఓటిటి సంస్థలు భారీ ఆఫర్లను ఇస్తున్నాయి. ముఖ్యంగా “వకీల్ సాబ్” కు అయితే మన తెలుగులో ఏ సినిమాకు కూడా ఇవ్వని భారీ ఆఫర్ ను ఇవ్వగా నిర్మాత దిల్ రాజు తృణ ప్రాయంగా వదిలేశారని టాక్ వినిపిస్తుంది.

లేటెస్ట్ రూమర్ ప్రకారం దిల్ రాజుకు 110 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ వదిలేశారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే బాక్సాఫీస్ దగ్గర రాజు గారికి పెద్ద టాస్కే అని చెప్పాలి. అప్పటికి థియేటర్స్ తెరుచుకొని పరిస్థితి అంతా బాగుంటే ఒకే కానీ మినిమమ్ నిబంధనలతో తెరుచుకున్నా అంత వసూళ్లు కష్టమే అని చెప్పాలి. మరి ఏం జరగనుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More