“ఆచార్య” నుంచి కూడా సాలిడ్ అప్డేట్ రాబోతోందా.?

Published on Aug 3, 2021 12:25 pm IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరు తో పాటుగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూటింగ్ లో ఉండగా లేటెస్ట్ బజ్ ఈ చిత్రం పై వినిపిస్తుంది.

మళ్ళీ ఇటీవల టాలీవుడ్ లో రిలీజ్ డేట్ ల పర్వం స్టార్ట్ అవుతుండగా ఆచార్య నుంచి కూడా విడుదల తేదీ అనౌన్సమెంట్ అతి త్వరలనే రానున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ కొన్ని రోజులు షూట్ కంప్లీట్ అయ్యాక మరిన్ని అప్డేట్స్ తో మేకర్స్ హోరెత్తించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మెగాస్టార్ స్ట్రామ్ ఎప్పుడు మొదలవుతుందో అన్నది చూడాలి.

ఇక ఈ చిత్రంలో కాజల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :