“సలార్” నుంచి క్రేజీ అప్డేట్ అంటూ సరికొత్త బజ్.!

Published on Aug 4, 2021 10:00 am IST


ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాలిడ్ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ప్రభాస్ రెండు షేడ్స్ లో కనిపించనున్న ఈ అవుట్ స్టాండింగ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇటీవలే రెండో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేసుకొని శరవేగంగా షూట్ ని జరుపుకుంటుంది.

అయితే ఇదిలా ఉండగా సలార్ షూట్ స్టార్ట్ అవుతుండడంతోనే ఈ సినిమా ట్యాగ్ అలా ట్రెండ్ అవుతూనే ఉంది. మరి దీనికి కారణం ఈ వీకెండ్ లో ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ రానుంది అని బజ్ క్రియేట్ అవ్వడమే.. అయితే ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ టాక్ అయితే నడుస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా “కేజీయఫ్” టెక్నీకల్ టీం నే వర్క్ చేస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని హోంబలే పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :