ప్రభాస్ ని కలిసే అరుదైన అవకాశం..,ట్రై చేస్తారా…?

Published on Aug 27, 2019 11:00 am IST

డార్లింగ్ ప్రభాస్ తన ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనను ప్రత్యక్షంగా కలిసే అరుదైన అవకాశాన్ని కల్పించారు. అందుకు మీరు చేయాల్సిందల్లా సాహో పోస్టర్ తో పాటు ఓ సెల్ఫీ దిగి ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి ట్యాగ్ చేసి పంపించాలి. అలా పంపిన ఫ్యాన్స్ నుండి కొందరిని ఎంపిక చేసి ప్రభాస్ వారితో పర్సనల్ గా ఇంటరాక్ట్ అవుతారట. ఈ విషయాన్ని ప్రభాస్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇంకా కేవలం 3 రోజులలో సాహో విడుదల నేపథ్యంలో ప్రభాస్ విరివిగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సాహో రికార్డ్స్ నమోదు చేస్తుంది. మొదటి రోజే సాహో ఒక భారీ ఫిగర్ ని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :