“డియర్ మేఘా”తో సిద్ శ్రీరామ్ నుంచి మరో క్లీన్ చార్ట్ బస్టర్!

Published on Jul 29, 2021 3:01 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రెడీ అవుతున్న చిత్రాల్లో అదిత్ అరుణ్ మరియు యువ హీరోయిన్ మేఘా ఆకాష్ ల కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం “డియర్ మేఘా” కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు మంచి ప్రమోషన్స్ ని కూడా జరుపుకుంటుండగా దీని నుంచి సరికొత్త పాటను మేకర్స్ రిలీజ్ చేసారు.

ప్రస్తుతం సంగీత లోకాన్ని తన గాత్రంతో ఊపేస్తున్న హ్యాపెనింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘బాగుంది ఈ కాలం’ అనే ఈ సాంగ్ చాలా ప్లెసెంట్ గా క్లీన్ అండ్ నీట్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం దానికి గౌర హరి సంగీతం కానీ చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి.

ఇంకా సిద్ మ్యాజికల్ వాయిస్ తో ఒక స్లో పాయిజన్ లా ప్రేక్షకులకి ఇది ఎక్కుతుందనిపిస్తుంది. దీంతో ఈ సినిమా నుంచి అలాగే సిద్ శ్రీరామ్ నుంచి ఒక క్లీన్ చార్ట్ బస్టర్ సాంగ్ టాలీవుడ్ ఆడియెన్స్ కి వచ్చింది అని చెప్పాలి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించబడ్డ ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.

ఆ లిరికల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :