‘తెనాలి రామకృష్ణ’కి సెన్సార్ పూర్తయింది !

Published on Nov 11, 2019 5:03 pm IST

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి ఈ కామెడీ ఎంటర్టైనర్ సన్నధం అవుతుంది.

ఇక గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ ‘నిన్ను వీడని నీడను నేనే’తో హిట్ అందుకున్నాడు. అయితే ఈ సారి సాలిడ్ హిట్ కోసం సందీప్ ఈ కామెడీ సినిమా చేస్తున్నాడు.

హ‌న్సిక కథానాయకిగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా అగ్రహారం నాగి రెడ్డి, సంజీవరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More