ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ రచ్చపై క్లారిటీ తెలుసుకోండి.!

Published on May 26, 2021 2:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అతి తక్కువ మంది హాలీవుడ్ లెవెల్ సాలిడ్ పర్సనాలిటీస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కూడా ఒకటి. బాహుబలి సినిమా తర్వాత నుంచి సాహో లాంటి భారీ యాక్షన్ సినిమా తీసి ఇంటర్నేషనల్ వైడ్ పాపులారిటీని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.

ఇక బాహుబలి లాంటి పాన్ ఇండియన్ సినిమాలో హీరో ప్రభాస్ అనే స్థాయి నుంచి తాను హీరోగా చేస్తే అది పాన్ ఇండియన్ సినిమా అన్న ట్రెండ్ ని ప్రభాస్ సెట్ చేసి పెట్టాడు. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నుంచి హాలీవుడ్ లెవెల్ సినిమా పడుతుందా లేదా అన్న ప్రశ్నకు పాన్ వరల్డ్ మూవీగా తమది ఉంటుంది అని టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేసాడు.

కానీ దానితో పాటుగా ప్రభాస్ సిసలైన హాలీవుడ్ ఎంట్రీపై గత కొన్ని రోజులు నుంచి ఒక రేంజ్ లో రచ్చ లేస్తుంది. ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” షూట్ ఇటలీలో జరుగుతున్న సమయంలో హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఫ్రాంచైజ్ “మిషన్ ఇంపాజిబుల్ 7” షూట్ కూడా అక్కడే జరిగిన సమయంలో ఆ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మాక్ క్వరీ ప్రభాస్ తో మాట్లాడ్డం జరిగింది అని..

అంతే కాకుండా ప్రభాస్ ఆ సినిమాలో హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ తో కూడా కనిపిస్తాడని అతనికి స్టోరీ చెప్పడం కూడా జరిగింది అని ఒక జాతీయ స్థాయి కథనం బయటకి వచ్చింది. దీనితో అక్కడ నుంచి ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీపై ఒక్కసారిగా రచ్చ స్టార్ట్ అయ్యింది.

అయితే ఆ కథనం సోషల్ మీడియాలో జస్ట్ ఫొటోస్ వైరల్ అయ్యాయి కానీ అసలు సమాచారం ఏంటి అన్నది ఇంకా ఎవరికీ తెలియదు.మరి ఇప్పుడు ఎట్టకేలకు టాక్ కి అదే దర్శకుడు చెక్ పెట్టేసారు. ప్రభాస్ చాలా టాలెంటెడ్ అని కానీ తాము అయితే ఎప్పుడు కలవలేదని ఈ రూమర్స్ కి సింపుల్ గా చెక్ పెట్టేసారు. సో ఇదంతా అవాస్తవం అని కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :