తమిళ్ బిగ్ బాస్-3కి హైప్ తెచ్చిన అతని ఎంట్రీ…!

Published on May 22, 2019 1:28 pm IST

లోకనాయకుడు కమల్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న తమిళ్ బిగ్ బాస్ రెండు సీజన్స్ సూపర్ సక్సస్ ఐయ్యాయి. ఎన్ని వివాదాలు ఎదురైనా, సాంప్రదాయ వాదులు ఖండించినా కమల్ ఈ షో ని నిరవధికంగా నడిపించారు. రెండు సీజన్స్ సూపర్ సక్సెస్ కావడంతో మూడవ సీజన్ ను త్వరలో గ్రాండ్ గా ప్రారంభించడానికి సిద్ధమైంది.

ఐతే ఈ సీజన్లో ఓ వ్యక్తి కాంటెస్ట్ చేయబోతున్నాడన్న వార్త ఇప్పడు సంచలనంగా మారింది.అది ఓ స్వలింగ సంపర్కుడు ఈ సీజన్లో పాల్గొనబోతున్నాడంట. కమల్ నిర్ణయంతోనే ఇది సాధ్యమైందట. బిగ్ బాస్ అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ప్రతిబింబించేదిగా ఉండాలని కమల్
అభిప్రాయం. బిగ్ బాస్ నియమాల ప్రకారం హౌస్ లోకి వెళ్లెవరకూ ఎవరి ఐడెంటిటీ తెలియకూడదు కాబట్టి సదరు లెస్బియన్ ఎవరు అనేది సస్పెన్స్.

ఐతే బిగ్ బాస్ షో లో లెస్బియన్స్,గే, ట్రాన్స్ జెండర్స్ పాల్గొనడం కొత్తేమీ కాదు, హిందీ, కన్నడ, ,మలయాళ భాషలలో ప్రసారమైన బిగ్ బాస్ షోస్ లలో ఈ కేటగిరికి చెందిన వ్యక్తులు కాంటెస్ట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More