పవన్ సెన్సేషనల్ కాంబో నుంచి మాసివ్ అనౌన్స్మెంట్.!

Published on Aug 14, 2021 7:07 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు సాలిడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ తన లైనప్ ని రెడీ చేసుకొని సన్నద్ధం అవుతున్నారు. మరి వాటిలో భారీ అంచనాలతో సిద్ధం అవుతున్న కాంబో కూడా ఒకటి ఉంది. అదే గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ కాంబో.. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీరి నుంచి సినిమా ఆనందంతో అంచనాలు పీక్స్ కి వెళ్లాయి.

మరి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా అదిరే ట్రీట్ ఇస్తుంది అని హరీష్ శంకర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే మరి ఈ సెన్సేషనల్ కాంబో నుంచి మాసివ్ అనౌన్స్మెంట్స్ సహా అప్డేట్స్ రానున్న పవన్ బర్త్ డే కి ఉన్నట్టు తెలుస్తుంది.. ఆ సినిమా టైటిల్ సహా ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్స్మెంట్ కూడా ఉండొచ్చని బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాతో వింటేజ్ కళ్యాణ్ ని చూపిస్తానని హరీష్ పలు మార్లు చెప్పాడు. మరి ఈ ఫెస్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :