ఓ మైండ్ బ్లోయింగ్ సీన్ షూట్ లో “రాధే శ్యామ్”.!

Published on Dec 5, 2020 9:02 am IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. ప్యూర్ పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలానే విశేషాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసిన మోషన్ పోస్టర్ టీజర్ కు అయితే అనూహ్య స్పందన వచ్చింది.

అయితే ఇప్పుడు ఫైనల్ షూట్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ పలు ఆసక్తికర సన్నివేశాలను తెరకెక్కించే పనిలో పడ్డారు. కొన్ని రోజుల కితం వర్షంలో ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ను వర్చువల్ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఇప్పుడు నీటిలో ఒక అద్భుత సన్నివేశాన్ని సరికొత్త సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

కొమొడో డిజిటల్ కెమెరా మరియు లఔవా అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాలతో ఈ సీక్వెన్స్ ను మైండ్ బ్లోయింగ్ గా తెరెకెక్కిస్తున్నారట. అలాగే ఈ సీన్ అవుట్ ఫుట్ పట్ల మేకర్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. మరి సినిమాలో ఈ సన్నివేశం ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More