“ఆదిపురుష్” ను సరికొత్త విధంగా చూపిస్తారా.?

Published on Dec 4, 2020 7:04 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ అండ్ విజువల్స్ తో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించనున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని అందరికీ తెలిసిన విధంగా కాకుండా కాస్త కొత్త కోణంలో చూపించే ప్రయత్నాన్ని ఓంరౌత్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అది ఎలా అంటే రామ, రావణ యుద్ధంలోని ఒక ప్రతీకారాన్ని కాకుండా ఇద్దరిలోని న్యాయపరమైన కోణం ను ఓంరౌత్ చూపించనున్నారట.

రావణునిలో మానవత్వాన్ని రామునితో యుద్దానికి ఎలా దారి తీసిందో అన్న కోణాలను ఊహించని విధంగా చూపిస్తారని ఇప్పుడు తెలుస్తుంది. ఇక అలాగే ఇంకా ఈ చిత్రానికి సీత పాత్ర ఎవరు అన్న దానిపై అలా సస్పెన్స్ కొనసాగుతుండగా హాలీవుడ్ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ నిర్మాణ సంస్థలతో నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలని మేకర్స్ భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More