ఇప్పుడున్న రోజుల్లో ఓ సినిమా విడుదలకు ముందే అన్ని డీల్స్ క్లోజ్ అవ్వడం, బిజినెస్ జరిగిపోవడం మామూలు విషయం కాదు. ఎన్నో క్రేజీ చిత్రాలకు ఇంకా ఓటీటీ డీల్ పూర్తి కాలేదు. కానీ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ మాత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. ఫాన్సీ రేటుకే ఈ సినిమాని మేకర్స్ అమ్మేశారు.
ఇక ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘నా పేరు శంబాల’ అంటూ సాగే ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్, శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన బాణీ అందరినీ హత్తుకునేలా ఉంది. ఇక స్పెషల్ గా షూట్ చేసిన లిరికల్ వీడియో, అందులో గీతా మాధురి కనిపించిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది.
నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో రాజీపడని నాణ్యతతో రూపొందిస్తున్నారు. ఈ మూవీని విజువల్ వండర్‌గా, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచారు. ప్రవీణ్ కె బంగారి అందించిన ఆకర్షణీయమైన విజువల్స్, శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా మారనున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో రాణించగల ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


