“కల్కి” కి సేఫ్ సైడ్ మరో రిలీజ్ ప్లాన్..?

“కల్కి” కి సేఫ్ సైడ్ మరో రిలీజ్ ప్లాన్..?

Published on Mar 17, 2024 1:05 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తో భారీ చిత్రం “కల్కి 2898ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం వరల్డ్ లెవెల్ సినిమాగా తెరకెక్కుతూ ఉండగా చిత్ర యూనిట్ అయితే ఇప్పుడు వరకు మే 9 రిలీజ్ నే టార్గెట్ గా పెట్టుకొని పనులు చేస్తున్నారు. కానీ అనుకోని విధంగా ఈ సినిమా రిలీజ్ కి ఎన్నికల షెడ్యూల్ దెబ్బ కొట్టింది. దీనితో కల్కి పోస్ట్ పోన్ ఆల్ మోస్ట్ ఖరారు అనేట్టు పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి.

అయితే ఇది వరకే ఈ చిత్రం రిలీజ్ ని ఆగస్ట్ 15 కి షిఫ్ట్ చేస్తున్నట్టుగా కూడా రూమర్స్ వచ్చాయి. మరి ఈ డేట్ కాకుండా సేఫ్ సైడ్ గా మరో రిలీజ్ ప్లాన్ కూడా ఈ సినిమా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం జూలై మధ్యలో లేదా జూలై 26న రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఇపుడు కల్కి చుట్టూతా పెద్ద సస్పెన్స్ నే నడుస్తుంది. మరి చూడాలి చివరికి ఏమవుతుంది అనేది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు