Varanasi: ‘వారణాసి’లో చిన్న ఛేంజ్!?

Varanasi: ‘వారణాసి’లో చిన్న ఛేంజ్!?

Published on Dec 17, 2025 5:00 PM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ ల కలయికలో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రమే “వారణాసి”. ఇటీవల వచ్చిన కేవలం అనౌన్సమెంట్ మోషన్ పోస్టర్ టీజర్ తోనే ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ఎంతో మాట్లాడుకున్నారు. ఇక అక్కడ నుంచి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ ని పూర్తి చేస్తూ వెళుతున్నారు. అయితే లేటెస్ట్ గా కొన్ని తాజా రూమర్స్ ఈ సినిమాలో వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం మరో కొత్త నటుడుని జక్కన్న చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది వరకే ఓ బాలీవుడ్ నటుడుని లాక్ చేసినప్పటికీ పలు కారణాలు రీత్యా ఆ నటుడు స్థానంలో మరో పాపులర్ అండ్ టాలెంటెడ్ సీనియర్ నటుణ్ని చూస్తున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ మరియు షోయింగ్ బిజినెస్ వారు భారీ బడ్జెట్ లతో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు