పందెంకోడి 2 విడుదలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్న విశాల్ !

Published on Oct 15, 2018 11:08 am IST

తమిళ హీరో విశాల్ తను నటించిన ‘సండకోళి 2’ విడుదలకు ముందు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో అక్టోబర్ 18న విడుదల కానుంది. దానికి ఒక రోజు ముందుగా తమిళ నాడు వ్యాప్తంగా ఈచిత్రాన్ని ప్రదర్శించనున్న థియేటర్ల ఓనర్స్ కి స్పెషల్ స్క్రినింగ్ లో ఈచిత్రాన్ని చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో. దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు విశాల్ ఈ సినిమా ఫై ఎంత కాన్ఫిడెంట్ గా వున్నాడని.

లింగు సామి తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి నాయకురాలి పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రం తెలుగులో ‘పందెంకోడి 2’పేరుతో భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :