SSMB 29 : ఒక్క లుక్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన సూపర్ స్టార్

SSMB 29 : ఒక్క లుక్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన సూపర్ స్టార్

Published on Apr 20, 2024 12:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించనుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించనున్నారు.

త్వరలో అనౌన్స్ మెంట్ కి రెడీ అయిన ఈ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఫిట్నెస్ పరంగా నిపుణుల నుండి విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాటర్ ఏమిటంటే, నేడు మహేష్ బాబుతో కలిసి నిర్మాత నారాయణ, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారి ఫోటోలు, వీడియోలు తీశారు మీడియా వారు.

అయితే చాలా రోజుల తరువాత కనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ క్రాఫ్ తో పాటు మీసం గడ్డంతో పవర్ఫుల్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఆ లుక్ తాలూకు ఫోటోలు, వీడియోలు నేడు ఉదయం నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ట్విట్టర్లో అవి ట్రెండింగ్ లో నిలవడం విశేషం. మరి ఈ పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు