రామ్ సినిమాలో ఇంట్రెస్టింగ్ అనిపించి చేస్తున్నాను – ఆది పినిశెట్టి

Published on Jul 19, 2021 3:00 pm IST

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో #RAPO19 తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం లో ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఏక కాలంలో లో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. అంతేకాక ఈ చిత్రం లో రామ్ సరికొత్త రూపం లో దర్శనం ఇవ్వనున్నారు. అయితే సరైనోడు చిత్రం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటిస్తున్నారు ఆది పినిశెట్టి. అయితే ఈ పాత్ర పట్ల స్పందిస్తూ, ఆది పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే దర్శకుడు వినిపించిన కథ విన్నాక, స్క్రిప్ట్ చదివాక వారం సమయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే సరైనొడు తర్వాత విలన్ పాత్రలో చేయాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నా, అయితే ఇది విన్నాక నార్మల్ రోల్ కాదనిపించిది అని అన్నారు. అయితే మామూలుగా విలన్ పాత్రకు డిటైలింగ్ ఉండదు, ఇందులో అది ఉందని అన్నారు.అయితే ఈ చిత్రం లో కడప, కర్నూల్ కి చెందిన రా అండ్ రస్టిక్ రోల్ అంటూ చెప్పుకొచ్చారు. తమిళం లో మధురై బేస్ లో ఉంటుంది అని తెలిపారు. సరైనోడు లో స్టైలిష్ విలన్ గా చేసిన తర్వాత, ఇందులో మళ్ళీ విలన్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అని అన్నారు.

అయితే ప్యారలల్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ షేర్ ను ఇందులో చూపించ వచ్చు అని అన్నారు. అయితే యూ టర్న్ నిర్మాతల తో తనకి రెండవ చిత్రం అని అన్నారు.రామ్ చేసిన సినిమాలు అన్నీ చూసినట్లు తెలిపారు. ఎనర్జిటిక్ గా చేస్తుంటారు అని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇద్దరం కలిసి ఈ సినిమాలో చేయబోతున్నందుకు హ్యాపీ గా ఉందని వ్యాఖ్యానించారు. లింగుస్వామి గారు బలమైన విలన్ పాత్ర ను చాలా స్ట్రాంగ్ గా చూపించనున్నారు అని అన్నారు. అయితే ఈ కారణాల వలన సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అవకాశాలు నటుడిగా నన్ను నేను విస్తరించుకోవడానికి అని, షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :