ఆది ఫస్ట్ షెడ్యూల్ ముగించేశాడు !

ఆది ఫస్ట్ షెడ్యూల్ ముగించేశాడు !

Published on Aug 4, 2018 10:33 PM IST

aadi1

‘ప్రేమకావాలి’ చిత్రంతో తెలుగు తెరకు హీరో గా పరిచియమయ్యాడు ప్రముఖ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్. విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈచిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఇక ఈచిత్రం తరువాత ఆది కి కష్టాలు మొదలయ్యాయి. ప్రేమకావాలి తరువాత 10 సినిమాల్లో నటించిన ఆది ఒక్క సినిమా తో కూడా విజయాన్ని అందుకోలేకపోయాడు.

ఇక ఇప్పుడు ఎలాగైనా విజయం సాధించాలని నూతన దర్శకుడు శ్రీనివాస్ నాయుడు తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. భీమవరం లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. చావాలి రామాంజనేయులు నిర్మిస్తున్న ఈచిత్రంలో సురభి కథానాయికగా నటిస్తుంది.
‘నెక్స్ట్ నువ్వే’చిత్ర పరాజయం తరువాత ఆది కొంత గ్యాప్ తీసుకోని ఈ కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి .

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు