పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన ఆది

పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన ఆది

Published on Oct 7, 2014 3:42 PM IST

aadi-in-rough
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరుణతో ఇటివలే నిశ్చితార్ధం చేసుకున్న యంగ్ హీరో ఆది, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేశాడు. డిసెంబర్ 13న హైదరాబాద్ లో ఆది వివాహం జరుగుతుంది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన నిశ్చితార్ధ వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులను కూడా పిలవడం కుదరలేదు. చాలా గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్ 13న జరిగే పెళ్ళికి మాత్రం అందరిని ఆహ్వానిస్తున్నాను. అని ఆది అన్నారు.

ఆది తండ్రి సాయి కుమార్, తాతయ్య పిజే శర్మలకు తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో దశాబ్దాల అనుభవం ఉంది. ఎందరో ప్రముఖులతో మంచి సత్సంభందాలు ఉన్నాయి. ఈ వేడుకకు మూడు చిత్ర పరిశ్రమల నుండి అతిరథ మహారధులు హాజరయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు