చివరి దశలో ఉన్న ఆది సినిమా !


‘శమంతకమణి’ చిత్రంలో ఒక కీలకపాత్ర చేసి మెప్పించిన యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం ‘నెక్స్ట్ నువ్వే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ ‘యామిరుక్క భయమే’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

ఈ సినిమాను ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్నారు. హార్రర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆదికి జంటగా వైభవి శాండిల్య నటిస్తోంది. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న ఆది ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.