ఆకట్టుకుంటున్న ‘బుర్రకథ’ టీజర్ !

Published on May 6, 2019 11:35 am IST

పెద్దగా హిట్లు లేకపోయినా, సాయికుమార్ ఆది మాత్రం వరుసగా సినిమాలను చేసుకుంటూ సరైన బ్రేక్ కోసం ముమ్మరంగా తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు. కాగా తాజాగా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కుతున్న ‘బుర్రకథ’ సినిమా టీజర్ ఈ రోజు ఉదయం 9:09 గంటలకు విడుదల అయింది.

టీజర్ లో కంటెంట్ కంటే కూడా డైలాగ్ లే హైలెట్ అయ్యాయి. ఎంతైనా డైలాగ్ రైటర్, డైరెక్టర్ గా మారితే ఇది చాలా సహజమైన విషయమే అనుకొండి. కానీ కాన్సెప్ట్ కూడా హైలెట్ అయితే బాగుండేది. మొత్తానికి టీజర్ అయితే యూత్ కు బాగానే కనెక్ట్ అయ్యేలానే ఉంది.

పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఆది సరసన మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా నటిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న ఈ సినిమా మే 24న రిలీజ్ కానుంది. మరి కనీసం ‘బుర్రకథ’ అయినా ఆదికి హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More