మామూలు సాదా సీదా సినిమాలు తెరకెక్కించడమే చాలా కష్టమైన పని అలాంటిది ఒక అడ్వెంచర్ లాంటి సినిమా చేయాలంటే అందరికీ ఒక సాహసమే అని చెప్పాలి. ఇక అందులో రియల్ స్టంట్స్ చేయాలనీ చూస్తే హీరోస్ కి అది మరిణిత సవాలు లాంటిది. ఇలా యంగ్ హీరో ఆది నటించిన అవైటెడ్ సినిమా శంబాల సినిమాలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.
ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్‌లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్‌కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్‌ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.
డీసెంట్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల అందించిన మ్యూజిక్, ఆర్ఆర్ మరో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇక ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.


