టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘శంబాల’ టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా మేకర్స్ రూపొందించగా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ శరవేగంగా నిర్వహిస్తోంది.
కాగా, ఈ సినిమాకు సంబంధించి అన్ని రకాల బిజినెస్ క్లోజ్ అయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ మంచి ఫ్యాన్సీ రేటుకు జరిగిందని.. ఈ సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలు మంచి లాభాల్లో ఉన్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఏపీ-సీడెడ్‌లో ఉషా పిక్చర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇప్పటివరకు ఉన్న బజ్‌ను చూస్తే, శంబాల చిత్రంతో ఆది సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతుంది. యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అర్చన అయ్యర్, శ్వాసిక, రవి వర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.


