మహేష్ బాబు బర్త్ డే కానుకగా ‘ఆగడు’ ఆడియో

Published on May 26, 2014 8:41 am IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడఖ్ లో జరుగుతోంది. లడఖ్ లోని పన్గాంగ్ లేక్ వద్ద మహష్ బాబు – తమన్నాలపై ఓ పాటని షూట్ చేస్తున్నారు. ఈ పాటకి దినేష్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ లడఖ్ షెడ్యూల్ ఈ నెల 30 వరకు జరగనుంది. ఆ తర్వాత ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.

ఇది వరకే తెలిపిన సమాచారం ప్రకారం ‘ఆగడు’ ఫస్ట్ లుక్ టీజర్ ని కృష్ణ బర్త్ డే కానుకగా మే 31న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ ని కూడా కట్ చేసారు. అలాగే ‘ఆగడు’ సినిమా ఆడియోని మహేష్ బాబు బర్త్ డే కానుకగా అనగా ఆగష్టు 9న రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది.

‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్ల – మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :