నేటితో ‘ఆగడు’కి గుమ్మడికాయ.!

Published on Sep 5, 2014 6:59 pm IST

Aagadu-(2)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఈ సినిమాలో మిగిలి ఉన్న రెండు పాటలను ఇటీవలే యూరప్ లో షూట్ చేసుకొని వచ్చారు. ఇండియాకి రాగానే ఆడియో లాంచ్ మరియు మహేష్ బాబు డబ్బింగ్ మొదలు పెట్టడం వల్ల ప్యాచ్ వర్క్ సీన్స్ షూట్ చేయడం కోసం కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఈ చిత్రంలో మిగిలి ఉన్న ఫైనల్ డే షూటింగ్ ని ఈ రోజు ఊటీలో మొదలు పెట్టారు. మరి కొద్దిసేపట్లో ఆగడు షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేస్తారు.

‘ఆగడు లాస్ట్ డే షూటింగ్ కోసం ఊటీకి వచ్చాము. షూటింగ్ మొదట మొదలు పెట్టిన చోటే ఫినిష్ చెయ్యడం ఆనందంగా ఉంది. రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. ఇక 14 రోజులు మాత్రమే’ అని శ్రీను వైట్ల ట్వీట్ కూడా వేసాడు. మహేష్ బాబు ఈ సినిమాలో రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సెప్టెంబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎస్ఎస్ తమన్ అందిచిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహేష్ బాబు సరసన మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. శ్రీను వైట్ల – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – మహేష్ బాబు కాంబినేషన్ లో ‘దూకుడు’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :