రామోజీ ఫిలిం సిటీలో ‘ఆగడు’ తదుపరి షెడ్యూల్

Published on May 29, 2014 9:04 am IST

Aagadu
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడక్ లో జరుగుతుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వచ్చే వారం నుండి మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

కామెడీ హై లైట్ గా ఉండబోతున్న ‘ఆగడు’ సినిమాలో బ్రహ్మానందం ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :