డైరెక్ట్ ఓటిటి గా విడుదల కానున్న “ఆకాశవాణి”

Published on Jul 14, 2021 11:54 am IST

తెలుగు సినీ పరిశ్రమలో చిన్నా పెద్దా సినిమాల విడుదలలు అన్ని కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డాయి. అయితే థియేటర్లు తెరిచినప్పటికి ప్రేక్షకులు వస్తారా రారా అనేది దర్శక నిర్మాతలను కలవర పెడుతున్న విషయం. అయితే ఈ నేపథ్యం లో కొన్ని సినిమాలు ఓటిటి బాట పట్టాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు విడుదల తేదీలను ప్రకటించాయి కూడా. అయితే తాజాగా ఆన్లైన్ ద్వారా విడుదల అయ్యేందుకు మరొక చిత్రం సిద్దం గా ఉంది. అదే ఆకాశవాణి.

అశ్విని గంగరాజు దర్శకత్వంలో సముద్రఖని, వినయ్ వర్మ, కాకుమాను ప్రధాన పాత్రలు గా తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి. ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా విడుదల అయ్యేందుకు సిద్దం అయింది. ఈ చిత్రం సోని లైవ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సాయి మాధవ్ బుర్రా, అశ్విన్ గంగరాజు, సందీప్ రాజు లు ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉండగా, తాజాగా ఓటిటి ద్వారా విడుదల కానుంది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో చిత్ర యూనిట్ లేదా సోని లైవ్ విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :