‘ఆమె’ మార్నింగ్ ‘షో’లు పడలేదు !

Published on Jul 19, 2019 12:00 pm IST

సంచలన నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు రత్న కుమార్ దర్శకత్వంలో ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం “ఆడై”. తెలుగులో ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకులు,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘ఆమె’గా విడుదల చేస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. రద్దు అవటానికి గల కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఇక ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ‘ఆడై ‘ తమిళనాడులో 500 స్క్రీన్లలో ఈ ఉదయం విడుదలైంది. ఈ సినిమా ముఖ్యంగా కొత్త కాన్సెప్ట్స్ పై ఆసక్తి చూపే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని.. అలాగే మూవీలో కాన్సెప్ట్ తో పాటు విజువల్స్ కూడా హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. మరి అమలాపాల్ కి ఈ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :