సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన సూపర్ స్టార్

Published on Mar 15, 2021 10:00 pm IST

భారతీయ సినీ హీరోల్లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ స్థానం ప్రత్యేకమైంది. ఆయన నటనే కాదు సమాజం పట్ల ఆయన దృక్పథం కూడ గొప్పగానే ఉంటుంది. సామాజిక అంశాల మీద, తన సినిమాల మీద తప్ప వేరే విషయాల మీద ఆయన పెద్దగా స్పందించరు. నెగెటివిటీకి చాలా దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తి మీద కొన్నాళ్ల క్రితం అసత్య ఆరోపణలు, అనవసరమైన విమర్శలు పుట్టుకొచ్చాయి. అది ఆయన్ను బాగా కలచివేసింది. అంతేకాదు ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో రాజకీయ అంశాల విషయమై సెలబ్రిటీలు టార్గెట్ అవుతున్న తీరు అందరం చూస్తూనే ఉన్నాం.

అందుకే ఆమిర్ ఖాన్ ఇకపై సోషల్ మీడియాలో ఉండకూడదని డిసైడ్ అయ్యారు. ఈరోజు తన 56వ పుట్టినరోజు సందర్బంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతఙ్ఞతలు తెలిపిన ఆయన ఆ వెంటనే ఇకపై సోషల్ మీడియాలో ఉండట్లేదని, ఇదే తన చివరి పోస్ట్ అని, సోషల్ మీడియాలో లేకున్నా తాను యాక్టివ్ గానే ఉంటాను కాబట్టి సోషల్ మీడియా అవసరం లేదని అన్నారు. ఇకపై తన గురించి, తన సినిమాల గురించిన సంగతులు, విశేషాలు ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ అనే అఫీషియల్ హ్యాండిల్ ద్వారా బయటికొస్తాయని ప్రకటించారు. ఇకపోతే ఆయన ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా చేస్తున్నారు. ఇది హాలీవుడ్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్.

సంబంధిత సమాచారం :