గత కొంత కాలంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ముంబైలో జరిగిన ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ స్క్రీనింగ్ సందర్భంగా ఆమీర్ ఖాన్ స్వయంగా తన పెళ్లి గురించి ప్రస్తావించాడు.
జూలై 5న తన నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన అధికారికంగా ధృవీకరించాడు. ఈ వివాహ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో చాలా సాదాసీదాగా జరగనుందని ఆమీర్ పేర్కొన్నాడు. ఇరు కుటుంబాలు ఈ వేడుకను ప్రైవేట్‌గా ఉంచాలని భావించాయని, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న తమను అందరూ ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా కోరాడు.
ఈ ఏడాది మొదట్లో తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆమీర్ ఖాన్ మొదటిసారిగా గౌరీ స్ప్రాట్‌ను మీడియాకు పరిచయం చేస్తూ, తాము గత ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రకటించాడు. అప్పటి నుండి వీరి పెళ్లి వార్తలు హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వచ్చాయి. ఇక తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు తెరపడింది.


