ఇష్క్ నుండి విడుదల కానున్న ఆనందం మదికే సాంగ్!

Published on Jul 23, 2021 2:20 pm IST


తేజ సజ్జ మరియు ప్రియా ప్రకాష్ వారిర్ లు లీడ్ రోల్స్ లో నటించిన తాజా చిత్రం ఇష్క్. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ విడుదల అయినప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి ఆనందం మదికే అనే పాట విడుదల కి సిద్దం అయింది. శ్రీమణి రాసిన పాటకు సిద్ శ్రీరామ్ మరియు సత్య యామిని లు స్వరాలు అందించగా, మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ పాట ను రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.

అయితే ఎస్.ఎస్ రాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి రతీష్ రవి కథ అందించారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్. వి. ప్రసాద్, పారాస్ జైన్, వకద అంజన్ కుమార్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 30 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :