టీజర్ తో సందడి చేయనున్న నారా రోహిత్ !
Published on Jun 8, 2018 11:18 am IST


హీరో నారా రోహిత్ తాజా చిత్రం ‘ఆటగాళ్లు’ చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించారు. ఈ చిత్ర టీజర్ రేపు 9వ తేదీ ఉదయం 10 గంటల 30 నిముషాలకు విడుదలకానుంది.

ప్రముఖ నటుడు రానా చేతుల మీదుగా ఈ రిలీజ్ జరగనుంది. పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రోహిత్ కు జోడీగా బెంగాలీ మోడల్ దర్శన బానిక్ నటిస్తోంది.

జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇది కాకుండా రోహిత్ నూతన దర్శకుడు ఎస్.డి.చక్రవర్తి డైరెక్షన్లో ఒక సినిమాకు సైన్ చేశారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook