బిగ్ బాస్ 4 – వీరు గెలుపును ముందే డిక్లేర్ చేసేసుకుంటున్నారు.!

బిగ్ బాస్ 4 – వీరు గెలుపును ముందే డిక్లేర్ చేసేసుకుంటున్నారు.!

Published on Dec 19, 2020 11:06 PM IST

Bigg 1
ఇప్పుడు మన తెలుగు స్మాల్ స్క్రీన్ వీక్షకుల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటివంటి బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కోసం రసవత్తరంగా చర్చలు నడుస్తున్నాయి. టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్న దానిపైనే నడుస్తున్న ఈ రచ్చలో టాప్ ఫైనలిస్టులుగా ఉన్నటువంటి ఈ కంటెస్టెంట్స్ లో ప్రతీ ఒక్కరి లెక్కలు కూడా ఊహించని విధంగా మారిపోయాయి.

మరి ఈ సమయంలో ఒక్కో కంటెస్టెంట్ ఫాలోవర్స్ తమ అభిమాన కంటెస్టెంటే విజేత అని చెప్పుకుంటున్నారు. కానీ అభిజీత్ ఫాలోవర్స్ అయితే ఏకంగా ఎవరు ఏమనుకున్నా సరే బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజీతే అన్ని వారి వారే డిక్లేర్ చేసేసుకుకుంటున్నారు.

ఇన్నాళ్లు భారీ ట్రెండ్స్ తో ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కి లేని సంచలన రికార్డులు అందించారు. అలాగే మొదటి నుంచీ వోటింగ్ లో కూడా అభిజీత్ స్థిరంగా టాప్ స్థానంలోనే ఉన్నాడని టాక్ కూడా ఉంది. మరి ఇప్పుడు వీరు చెప్తుంది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది ఇంకో రోజులో తేలిపోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు